Bigg Boss 5 Telugu: నామినేషన్స్ లో గెలిస్తే గేమ్ ప్లాన్ మారుస్తారా..?

బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం ఆసక్తికరమైన నామినేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా ఫస్ట్ టైమ్ సన్నీ ఇంకా సిరి ఇద్దరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. అంతేకాదు, ఈసారి బిగ్ బాస్ రెండు ఓట్లు వచ్చినా కూడా నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చాడు. ఇందులో సన్నీ, సిరి, కాజల్, ప్రియలు రెండు ఓట్లతో నామినేషన్స్ లోకి వచ్చారు. విశ్వ, ప్రియాంక, శ్వేత, శ్రీరామ్ లు ఒక్కఓటుతో బచాయించిపోయారు.

ఫస్ట్ టైమ్ సన్నీ ఇంకా సిరిలు నామినేషన్స్ లోకి రావడంతో వాళ్ల సపోర్టర్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓటువేయండి అంటూ క్యాంపైన్స్ మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో నాలుగువారాలు గడుస్తున్నా ఇప్పటివరకూ షణ్ముక్ నామినేషన్స్ ని ఎదుర్కోలేదు. ఇక సిరి ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యింది కాబట్టి రెండోవారం తప్పించుకుంది. మూడోవారం సిరిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. టాస్క్ లే ఎగ్రెసివ్ గా ఆడినా కూడా సిరిని టార్గెట్ చేయలేకపోయారు. మరోవైపు సన్నీ కూడా నొప్పించక, తానొవ్వక అన్నట్లుగానే గేమ్ ఆడుతున్నాడు.

లాస్ట్ టైమ్ ప్రియ ఓట్ వేసినా కూడా నామినేషన్స్ లోకి రాలేదు. అలాగే, ఇప్పుడు రెండు ఓట్లు వచ్చినా కూడా నామినేషన్స్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఏకంగా ఈవారం 8మంది నామినేషన్స్ లో ఉండటం అనేది ఆసక్తిగా మారింది. వీరిలో ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు. ఎవరు సేఫ్ జోన్ లో ఉంటారు అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతం మొదటిసారి సన్నీ ఇంకా సిరి ఉన్నారు కాబట్టి ఒకవేళ సేఫ్ అయితే వారి గేమ్ ప్లాన్ రానున్న వారాల్లో మార్చుకుంటారా లేదా అనేది కూడా చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus