Allu Arjun: ‘ఎఎఎ’ కమింగ్‌ సూన్‌.. సినిమాలే కాదు.. క్రికెట్‌ కూడా!

సినిమా అన్నాక హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఆ హీరో సినిమాలో అన్ని ఎలివేషన్ సీన్లున్నాయి, ఇం ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది అంటూ లెక్కలేసుకుంటారు. అలా చూసుకోకపోతే అలరించలేరు కూడా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్ల విషయంలో కూడ వర్తిస్తోందా. అవుననే అనిపిస్తోంది హైదరాబాద్‌లో సిద్ధమవుతున్న మల్టీప్లెక్స్‌ చూస్తుంటే. హైదరాబాద్‌లోని అమీర్‌ పేట ప్రాంతంలో అల్లు అర్జున్‌కి చెందిన ఓ భారీ మల్టీప్లెక్స్‌ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని విషయాలు బయటికొచ్చాయి.

మల్టీప్లెక్స్‌లో ఎన్ని స్క్రీన్లున్నాయి, ఎలాంటి షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి లాంటి వివరాలతోపాటు అందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్ల వివరాలు బయటికొచ్చాయి. మహేష్ బాబు భాగస్వామ్యంలో AMB మల్టీ ఫ్లెక్స్ నిర్మించి వావ్‌ అనిపించిన ఆసియన్ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలసి AAA మల్టీప్లెక్స్‌ నిర్మిస్తోంది. ఫేమస్‌ అమీర్ పేట సత్యం థియేటర్‌ను తీసుకుని AAA (ఆసియన్ అల్లు అర్జున్)ను రెడీ చేశారు. లోపలి వర్క్‌ దాదాపు పూర్తయిందంటున్నారు. మూడు నెలల్లో మల్టీప్లెక్స్‌ సిద్ధమవుతుందని సమాచారం.

ఏఎంజీలో స్క్రీన్లతోపాటు ఎం లాంజ్‌ చాలా ఫేమస్‌. ఇప్పుడు అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌లో కూడా అలాంటిదే ఒకటి ఏర్పాటు చేస్తున్నారట. అందులో మంచి ముచ్చట్లు పెట్టుకోవడమే కాకుండా.. ఎంటర్‌టైన్మెంట్ను కూడా ఆస్వాదించొచ్చు అంటున్నారు. అలాగే బన్నీ సినిమాల్లో వాడిన వస్తువులు, అలాంటి వస్తువులను బన్నీ కలక్షన్స్‌ పేరుతో అమ్మే ఆలోచన కూడా చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీంతో బన్నీ లాంటి ఓ వర్చువల్‌ స్క్రీన్‌ ఉంటుంది అంటున్నారు. దాని ప్రత్యేక ఏంతో తెలియాల్సి ఉంది.

ఈ మల్టీప్లెక్స్‌ కోసం ప్రత్యేకంగా భారీ టీవీ స్క్రీన్‌ను సిద్ధం చేశారని టాక్‌ వినిపిస్తోంది. అంటే ప్రొజెక్టర్‌ లేకుండానే అందులో బొమ్మ చూడొచ్చు అంటున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ల లైవ్‌ టెలీకాస్ట్‌ లాంటివి చేసి.. వాటికి కూడా టికెట్లు అమ్మే ఆలోచన ఉంది అంటున్నారు. వచ్చే వన్డే వరల్డ్‌ కప్‌ను ఉద్దేశించి ఈ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తున్నారని టాక్‌.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus