Super Star Krishna: కృష్ణ తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

  • November 20, 2022 / 06:53 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన కృష్ణ 350కు పైగా సినిమాలలో నటించి మెజారిటీ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త నిజం కాకపోతే బాగుండేదని దేవుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని మహేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కృష్ణతో పని చేసిన నిర్మాతలు ఆయనను దేవుడిలా భావించేవారు. కృష్ణ పరిమితంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం ద్వారా నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.

అయితే ప్రస్తుతం ఒక్కో స్టార్ హీరో 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా కృష్ణ డిమాండ్ చేసి తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే కొందరు నిర్మాతలు మాత్రం కృష్ణగారికి ఇష్టం లేకపోయినా 50 లక్షల రూపాయల రేంజ్ లో కృష్ణగారికి రెమ్యునరేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ షూటింగ్ పూర్తైన తర్వాత సినిమా చూసి ఆ సినిమా ఫలితాన్ని అంచనా వేసేవారని ఆయన చెప్పుకొచ్చారు. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని మూడు షిప్ట్ లలో పని చేసిన అతికొద్ది మంది హీరోలలో కృష్ణ ఒకరు.

హీరోగా కృష్ణ తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ 15 లక్షల రూపాయలు మాత్రమేనని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సమయంలో 25 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది. కొంతమంది నిర్మాతలు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా కృష్ణగారు ఏమీ అనేవారు కాదని సమాచారం. కృష్ణలాంటి హీరోలు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం అని చెప్పవచ్చు. కృష్ణ కెరీర్ లోని పలు సూపర్ హిట్ సినిమాలను మహేష్ తో రీమేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus