Mahesh Babu: తన ఫౌండేషన్ ద్వారా మరో చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఓ మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి సర్జరీలు నిర్వహించి ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మ అందించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు ఆపరేషన్లు నిర్వహించి వారి ప్రాణాలను కాపాడారు.

ఇలా ఇప్పటికే ఎంతోమందికి సహాయ సహకారాలు అందించి ప్రాణాలను నిలబెట్టిన మహేష్ తాజాగా మరో చిన్నారికి కూడా పునర్జన్మను అందించారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఏడు సంవత్సరాలు వయసు కలిగినటువంటి క్రాంతి కుమార్ అనే చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించారు. టెట్రాలజీ ఆఫ్‌ ఫాలట్‌ అనే గుండె సంబంధిత సమస్య ప్రతి10 వేల మంది నవజాత శిశువుల్లో.. ముగ్గురిలో ఈ సమస్య కనిపిస్తుంది. చిన్న వయసులోనే తగిన చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదు.

ప్రస్తుతం క్రాంతి కుమార్ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోని తమ కుమారుడి సమస్యను మహేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లడంతో మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా క్రాంతి కుమార్ కు ఆంధ్ర హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు చొరవతోనే తమ చిన్నారి ప్రాణాలు నిలబడ్డాయని క్రాంతి కుమార్ తల్లితండ్రులు మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇలా మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా మరో చిన్నారికి పునర్జన్మ అందించడంతో ఈయన రియల్ హీరో అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఫౌండేషన్ కిపునాది పడటానికి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ అని చెప్పాలి.గౌతమ్ నెలలు నిండకనే జన్మించడంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే తమకు డబ్బు ఉండి తన కొడుకును బ్రతికించుకున్నాను మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆలోచన రావడంతోనే మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పడిందని గతంలో మహేష్ బాబు తెలియజేశారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus