Rajinikanth, Meena: నాకు ఇష్టమైన హీరోయిన్లలో మీనా ఒకరు: రజనీకాంత్

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్ తాజాగా నటి మీనా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మీనా గురించి మాట్లాడుతూ మీనా తనకు కూతురు గాను, మేనకోడలి గాను సినిమాలలో నటించారని తెలిపారు. ఇక యజమాన్ సినిమా చేస్తున్న సమయంలో హీరోయిన్ ఎవరు అని అడిగాను అయితే వెంటనే మీనా అని చెప్పారు.

మీనా అంటే ఎవరని నేను అడగగా బలవంతంగా నాతో మీనా నటించిన రెండు తెలుగు సినిమా పాటలను చూపించారు. అయితే అలా ఆ సమయంలో మీనాను చూసిన నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడ నేను చేసిన సినిమాలలో చిన్నపిల్ల అని ఆశ్చర్యపోవడమే కాకుండా తన అందం చూసి ఆశ్చర్యపోయానని తెలియజేశారు. ఇలా నటనలో మీనా ఎంతో ప్రతిభావంతురాలని నిజాయితీపరురాలని రజనీకాంత్ తెలియజేశారు.

నేను ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లతో సినిమా చేసిన తనకు ఇద్దరు హీరోయిన్లు అంటే చాలా ఇష్టం అని అందులో ఒకరు శ్రీదేవి కాగా మరొకరు మీనా అంటూ మీనా గురించి రజనీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో మీనా ప్రతిభ గురించి కూడా మాట్లాడుతూ తన ప్రతిభ తనని ఈ స్థాయికి తీసుకు వచ్చిందని తెలిపారు.

ఇక మీనా గారి తల్లి మా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగిన తప్పకుండా హాజరయ్యేవారని ఈ సందర్భంగా మీనా కుటుంబంతో రజనీకాంత్ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి మీనా అందం తన నటన ప్రతిభ గురించి రజనీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక మీనా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus