Superstar Krishna: రెమ్యునరేషన్ విషయంలో కృష్ణ గ్రేట్.. ఎందుకంటే?

  • November 15, 2022 / 11:54 AM IST

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త సినీ, రాజకీయ ప్రముఖులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తెలుగువారి అల్లూరి సీతారామరాజు అయిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు ఉదయం 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న కృష్ణ నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు. హీరోగా కృష్ణ నటించిన తొలి సినిమా తేనె మనసులు కాగా ఈ సినిమాకు కృష్ణ 2000 రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నారు.

1965 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాతో హీరోగా మంచి పేరును సొంతం చేసుకున్న కృష్ణ ఆ తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక దశలో కృష్ణ సినిమాలు వరుసగా సక్సెస్ సాధించగా చాలామంది దర్శకులు రెమ్యునరేషన్ ను పెంచాలని సూచనలు చేసినా కృష్ణ మాత్రం రెమ్యునరేషన్ ను పెంచలేదు. దాదాపుగా 40 సినిమాలకు కృష్ణ 5000 రూపాయల చొప్పున పారితోషికం అందుకున్నారు. అప్పట్లో 5000 రూపాయల రెమ్యునరేషన్ అంటే

ఇప్పుడు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కు సమానం కాగా కృష్ణ మాత్రం తన సినిమాల ద్వారా నిర్మాతలకు బెనిఫిట్ కలిగితే చాలని భావించేవారు. తను హీరోగా నటించిన సినిమా ద్వారా నిర్మాత నష్టపోతే కృష్ణ వెంటనే ఆ నిర్మాతకు మరో ఛాన్స్ ఇవ్వడంతో పాటు నిర్మాతకు ఆర్థికంగా బెనిఫిట్ కలిగేలా తన వంతు సహాయసహకారాలు అందించేవారు.

తన సినీ కెరీర్ లో కృష్ణ వివాదాలకు దూరంగా ఉన్నారు. ఇతరుల మంచి కోరే కృష్ణ ఎక్కువ సంఖ్యలో మల్టీస్టారర్ సినిమాలలో, రీమేక్ సినిమాలలో నటించారు. జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగించిన కృష్ణ మహేష్ బాబును సూపర్ స్టార్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసిన కృష్ణ ఆ సహాయాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus