ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో కృష్ణ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదే టైంకి శోభన్ బాబు గారు కూడా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు తన ప్రత్యేకతని చాటుకుని ఆ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. నిజానికి ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలు నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగినప్పటికీ.. కృష్ణగారినే అంతా సూపర్ స్టార్ అని పిలుచుకునేవారు. అది అంత ఈజీగా వచ్చింది కాదు.
కృష్ణ తన మొదటి సినిమా నుండే ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. అందుకే సూపర్ స్టార్ బిరుదుని కృష్ణగారికి కట్టబెట్టారు ప్రేక్షకులు. 5 ఏళ్లలో 100 సినిమాలు పూర్తి చేసిన ఘనత ఆయనది. ‘మనం కూర్చుని అన్ని పనులు అయిపోవాలి అంటే అయిపోవు… మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు’ అనే సిద్ధాంతాలు ఆయనవి. అందుకే ఆయన సినిమాల్లో తిరుగులేని రారాజుగా వెలుగొందారు.సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన తన సత్తా చాటారు. అయితే అది ఎక్కువ కాలం కాదు.
కృష్ణ గారు లోక్‌సభ మాజీ ఎంపీ అని ఇప్పటి జనరేషన్ కు చాలా మందికి తెలీదు. సినీ పరిశ్రమ నుండి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలంతా మద్దతు పలికారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ తొలి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ‘ఈనాడు’ అనే సినిమాను తీశారు. అది తెలుగుదేశం పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో.. టీడీపీకి ప్లస్ అయ్యింది. అటు తర్వాత.. కృష్ణ- ఎన్టీఆర్ ల మధ్య కొంత దూరం ఏర్పడింది.
తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారికి కృష్ణ సపోర్ట్ చేస్తున్నట్లు పేపర్లో ప్రకటన వచ్చింది. దీంతో ఎన్టీఆర్ -కృష్ణ రాజకీయాల పరంగా ప్రత్యర్ధులయ్యారు. తర్వాత కృష్ణ.. ఎన్టీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ పలు సినిమాలు చేయడం జరిగింది.వాటి విడుదలకు ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి చాలా ఆటంకాలు వచ్చేవి. అదే టైంలో రాజీవ్ గాంధీ- కృష్ణ మిత్రులు అవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏలూరు నుండి ఆయన
లోక్‌సభకు పోటీ చేసి 71వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవ్వడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు రావడం అందులో కృష్ణ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం రీత్యా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా వ్యవహరించేవారు. కృష్ణ గారు చనిపోయే ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీకే మద్దతు దారులుగా వ్యవహరించారు
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!