Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు
- June 17, 2025 / 06:21 PM ISTByDheeraj Babu
కమల్ హాసన్ (Kamal Haasan) తాజా చిత్రం “థగ్ లైఫ్” (Thug Life) కర్ణాటక రిలీజ్ విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కన్నడ భాష పుట్టింది తమిళం నుంచి అని కమల్ హాసన్ చేసిన స్టేట్మెంట్ పై కర్ణాటక ప్రజలు, ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యారు.
Thug Life
ఆ విషయమై క్షమాపణ చెప్పాల్సిందిగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ కోరగా.. కమల్ హాసన్ (Kamal Haasan) చాలా నిక్కచ్చిగా నేను చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అంతగా అవసరం అనుకుంటే తన సినిమాను కర్ణాటక రాష్ట్రంలో రిలీజ్ చేయకుండా ఉంటాను కానీ.. క్షమాపణ మాత్రం చెప్పనని తెగేసి చెప్పేశాడు కమల్ హాసన్.ఇప్పుడు ఆ విషయంలో కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

సెన్సార్ పూర్తి చేసుకుని సి.బి.ఎఫ్.సి సర్టిఫికెట్ అందుకున్న సినిమా రిలీజ్ ను కొందరు గొడవ చేశారని రిలీజ్ చేయకుండా ఎలా ఉంటారు అంటూ కర్ణాటక కోర్టు నిర్ణయాన్ని కడిగిపారేసింది సుప్రీం కోర్టు.“థగ్ లైఫ్” (Thug Life) సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం కాసేపు పక్కన పెడితే.. ఓవరాల్ కలెక్షన్స్ మీద కర్ణాటక రిలీజ్ లేకపోవడంతో అనేది ఎఫెక్ట్ చూపించింది.

కనీసం 10 కోట్ల రూపాయల నష్టమైనా కమల్ హాసన్ (Kamal Haasan) కు జరిగి ఉండొచ్చు. మరి కర్ణాటక హైకోర్టు లేదా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో కమల్ హాసన్ (Kamal Haasan) కి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు అనేది చూడాలి. అయితే.. కమల్ (Kamal Haasan) & టీమ్ మాత్రం సుప్రీం కోర్ట్ తమకు సపోర్ట్ గా నిలవడంపై సంతోషం వ్యక్తం చేసింది. సినిమా ఫ్లాపయినా తన పంతం నెగ్గించుకున్నందుకు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా హ్యాపీగా ఫీలై ఉంటాడు.
సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?












