“పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్” లాంటి సినిమాల్లో సాయిధరమ్ తేజ్ అలియాస్ సాయితేజ్ ను చూసినప్పుడు “కుర్రాడిలో మంచి ఎనర్జీ ఉంది” అనిపించింది. ఇక తన మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చేసినప్పుడు భలే చెశాడ్రా అని మెగా అభిమానులే, సగటు ప్రేక్షకులు కూడా మురిసిపోయాడు. ఒకానొక స్టేజ్ లో నానికి పోటీ ఇవ్వగల ఏకైక హీరో అని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయాయి.
యంగ్ హీరోస్ లో మాస్ & క్లాస్ ఇమేజ్ సంపాదించుకొనే తదుపరి హీరో ఇతడే అని ఫిక్స్ అయిపోయి సుప్రీమ్ హీరో అని బిరుదును కూడా కట్టబెట్టారు. అయితే.. మరి కెరీర్ మీద కాన్సన్ ట్రేషన్ తగ్గిందో లేక ఫిజిక్ మైంటైన్ చేయడం కష్టంగా ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ.. మనోడిలో స్పాంటేనిటీ విశేషమైన రీతిలో తగ్గిపోయింది. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్” లాంటి సినిమాల్లో సాయితేజ్ లో కనిపించిన స్పార్క్, యాక్టివ్ నెస్ “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాలో కనిపించలేదు.
పాత్రలో మంచి ఎనర్జీ ఉన్నప్పటికీ, అది సాయితేజ్ లో ఎక్కడా కనిపించలేదు. ఇక కామెడీ టైమింగ్ లో స్పాంటేనిటీ అనేది వెతుక్కోవాల్సి వచ్చింది. హీరోగా భీభత్సమైన బ్యాగ్రౌండ్, సపోర్ట్ & సినిమాలు ఉన్నప్పటికీ తేజు ఇలా నీరసంగా కనిపించడం అనేది సమంజసం కాదు. నాని, శివ కార్తికేయన్ లాంటి హీరోలను చూసైనా తేజు తనలో ఎనర్జీ నింపుకోవాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!