Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej)(సాయి ధరమ్ తేజ్) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘సుప్రీమ్’ (Supreme). దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించారు.2016 మే 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. చిరంజీవి (Chiranjeevi) ‘పసివాడి ప్రాణం’ సినిమాని అటు తిప్పి.. ఇటు తిప్పి తీసినట్టు ఉంటుంది. కానీ సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యింది.

Supreme Collections:

అలాగే చిన్నపిల్లాడు మిఖాయిల్ గాంధీ పాత్ర కూడా బాగా డిజైన్ చేశారు. ఇక హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) అండ్ ఫ్యామిలీ కామెడీ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. అందుకే సమ్మర్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 8.45 cr
సీడెడ్ 3.50 cr
ఉత్తరాంధ్ర 2.98 cr
ఈస్ట్ 1.85 cr
వెస్ట్ 1.40 cr
గుంటూరు 1.97 cr
కృష్ణా 1.41 cr
నెల్లూరు 0.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.35 cr
ఓవర్సీస్ 0.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 25.38 కోట్లు(షేర్)

‘సుప్రీమ్’ (Supreme) సినిమా రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో రూ.25.38 కోట్లు షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.38 కోట్ల షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. దిల్ రాజు, సాయి దుర్గ తేజ్..ల కాంబినేషన్లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitam) ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) హిట్ సినిమాలు వచ్చాయి. ‘సుప్రీమ్’ తో వీరి కాంబోలో హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యింది అని చెప్పాలి.

అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు.. కేసు నమోదు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus