న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తెలుసా… అక్కడ నాస్‌డాక్ భవనం ఒకటి ఉంటుంది. చాలా ఫేమస్ బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ మొత్తం డిస్‌ప్లేలు అమర్చి ఉంటాయి. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆ డిస్‌ప్లేల్లో ఓ ఫొటో కనిపిస్తుంది. అలా అందులో ఫొటో/వీడియోగా రావడం చాలా పెద్ద గౌరవంగా భావిస్తుంటారు. గతంలో చాలామంది ప్రముఖుల ఫొటోలు డిస్‌ప్లే అయ్యాయి. అందులో నటులు కూడా ఉన్నారు. అయితే దక్షిణాది నటులకు ఇప్పటివరకు ఆ అవకాశం దక్కేలేదు. తాజాగా రామ్‌చరణ్‌కు ఆ అరుదైన గౌరవం దక్కింది.
రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నాస్‌డాక్ భవంతిపై రామ్‌చరణ్ ఫొటోను ప్రదర్శించారు. దాంతో పాటు హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్ అని కూడా రాసుకొచ్చారు. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక దక్షిణాది నటుడు రామ్‌చరణ్ కావడం గమనార్హం. భవంతిపై రామ్‌చరణ్‌ను ఫొటోను ప్రదర్శించిన విషయాన్ని ఆయన సతీమణి ఉపానన కొణిదెల ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. దాంతోపాటు‘‘ఇదొక స్టార్ స్ట్రక్.. తీపి గుర్తు..’’ అంటూ రాసుకొచ్చారు ఉపాసన. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ శుక్రవారమే పోస్టర్‌తో విషెస్ చెప్పింది.
శనివారం ఉదయం ‘ఆచార్య’ టీమ్ పోస్టర్‌ను లాంచ్ చేసి విష్ చేసింది. మధ్యాహ్నానికి ఉపాసన ట్విటర్‌లో నాస్‌డాక్ భవంతి వీడియో వచ్చింది. అలా ఈ రోజంతా చరణ్ అభిమానులకు ఆనందమే. మరోసారి మనమూ చెప్పేద్దాం… హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్.