Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం: నిర్మాత సురేష్ బాబు

‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం: నిర్మాత సురేష్ బాబు

  • December 10, 2022 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం: నిర్మాత సురేష్ బాబు

విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపధ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలనివుందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం.

ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చారిటీల కోసం పని చేస్తున్నాను. విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం ఎక్కువ సమయం పని చేస్తున్నాను. పిల్లల్ని చదివిస్తే దానికి కంటే మెరుగైన అభివృద్ధి ఈదేశానికి మరొకటి వుండదని భావిస్తాను. అలాగే పర్యావరణం కోసం కూడా కొంత పని చేస్తున్నాను. ఇటివల ఒక షో కి వెళ్ళినపుడు సినిమా పరిశ్రమలో ఓ టెక్నిషియన్ కి కొంత డబ్బు చారిటీ గా ఇచ్చాం. అయితే అన్ని విభాగాలకు అసోషియేసన్స్ వున్నాయి. సంక్షేమం కంటే అందరిలో స్కిల్ ని ఎలా పెంపొందించాలనే అంశంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుందని భావిస్తాను. విద్య, తగిన నైపుణ్యం మెరుగైన జీవితాన్ని ఇస్తాయి.

నారప్ప తర్వాత మీడియాని కలవలేదు. చాలా అంశాలు పై మీ అభిప్రాయాన్ని చెప్పలేదు కదా ?

నిజానికి నేను తక్కువ మాట్లాడానికి ప్రయత్నిస్తాను కానీ ఎక్కువ మాట్లాడేస్తాను.(నవ్వుతూ)ప్రతి అంశంపై అందరికీ కొన్ని అభిప్రాయాలు వుంటాయి. అయితే ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు టికెట్ల రేట్లు సమావేశానికి ఎందుకు వెళ్ళలేదని బాలకృష్ణ గారు ఒక షోలో అడిగారు ఎక్కువ టికెట్ రేట్లు పెంచకూడదని నా వ్యక్తిగత నమ్మకం. కొన్ని సినిమాలకు పెంచుతారు. అది ఇండిపెండెంట్ సినిమాకి లాభం. కానీ ఓవరాల్ గా పెంచకూడదని నా అభిప్రాయం. మధ్యతరగతి వారికి సినిమా ఎప్పుడూ అందుబాటులో వుండాలి. కొందరు మరో లా ఆలోచిస్తారు.

అవాతర్ టికెట్లు కొన్ని మల్టిఫ్లెక్స్ లో మూడు, ఐదు వేలకు అమ్ముతున్నారు. మధ్యలో ఒకసారి మల్టీ ప్లెక్స్ లో టికెట్ ధర 70 రూపాయిలు పెట్టారు. షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే రెవెన్యూ పెంచవచ్చు. అయితే ఇందులో ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి లేదు. కొన్ని సార్లు చర్చలు వ్యక్తిగతంగా కూడా మారిపోతుంటాయి. అందరినీ కలిపి ఒక తాటిపై తీసుకురావడం కష్టం. అందుకే ప్రతి కంపెనీ ఒక ఇండస్ట్రీగా మారి తన నిబంధనలు ప్రకారం నడవడానికి ప్రయత్నిస్తుంటుంది.

నారప్ప సినిమా మొదట థియేటర్లోకి రాకపోవడానికి కరోనా నే కారణమా ? లేదా మంచి ఆఫర్ వలన ఓటీటీలో విడుదల చేశారా ?

కరోనా ఒక సమస్య. జనం ఎంతమంది వస్తారో అనే భయం వుండేది. ఒకవేళ జనం రాకపోతే పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం వుంది. మా పార్ట్నర్ నిర్మాత కూడా వుండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ కేవలం సురేష్ ప్రొడక్షన్ ఒక్కటే వుంటే.. పొతేపోనీ థియేటర్ లోనే విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చేవాళ్ళం. వెంకటేష్ మాత్రం దృశ్యం ఓటీటీకి ఇచ్చేసినా నారప్ప మాత్రం థియేటర్ లో విడుదల చేయమని చెప్పారు. ఫ్రాఫిట్ వచ్చింది. థియేటర్ లో విడుదల చేసుంటే ఇంకా ఎక్కువ ఫ్రాఫిట్ వచ్చేదేమో. దృశ్యం 2 హిందీ రిజల్ట్ చూసిన తర్వాత ఇలా అనిపించింది.

నారప్పని ఒక్క రోజు మాత్రమే థియేటర్ లో వేయడానికి కారణం ?

ఇది అమెజాన్ ఇష్యూ. నాకు పర్శనల్ రిలేషన్ షిప్ తో ఒక్క రోజు ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ వాళ్లకి వుంది. అమ్మిన వారంతా ఒక రోజు అడిగి బావున్న తర్వాత మరో వారం ఇవ్వండని అడిగితే.. వాళ్ళ బిజినెస్ కూడా జరగాలి కదా.

‘నారప్ప’ విషయంలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది ?

వెంకటేష్ ఇలాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు. ఇదే పెద్ద ఛాలెంజ్. చాలా కష్టమైన యాక్షన్. వెంకటేష్ తన పెర్ ఫార్మ్మెన్స్ పట్ల చాలా తృప్తిగా వున్నారు.

నారప్ప, దృశ్యం 2 థియేటర్స్ లోకి రాలేదు కదా.. ఏదైనా రిగ్రట్ ఉందా ?

చిన్న రిగ్రేట్ వుంది. రెండు సినిమాలు బావున్నాయి. థియేటర్స్ లో బాగా ఆడేవి. డబ్బు కూడా అంతే వచ్చేదేమో. కానీ అప్పటి కరోనా సమయంలో పరిస్థితి అందోళన కరంగా వుండేది.

సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో చర్చ నడుస్తుంది..అగ్ర నిర్మాతగా మీ అభిప్రాయం ?

ఎవరి సినిమాని ఆపలేం. అన్ని సినిమాలు విడుదల కావాలి. అందరికీ థియేటర్స్ ఇవ్వాలి. అందరూ విడుదల చేసుకోవాలి. బెటర్ సినిమాకి బెటర్ థియేటర్లు దొరికుతాయి తప్పితే ఒకరిని ఆపే ప్రసక్తే వుండదు.

కరోనా తగ్గిన తర్వాత కూడా హీరోలు ఒక వైపు థియేటర్ సినిమాలు చేస్తూనే మరో వైపు ఓటీటీలు చేస్తున్నారు ? దిన్ని ఎలా చూస్తారు ?

వాళ్ళ కెరీర్ ని వాళ్ళు ఎలా మలుచుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఛాయిస్. వెంకటేష్ బాబు విషయానికి వస్తే..హిందీలో ఒక సినిమా ఫ్రండ్షిప్ కోసం చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. రానా తను కలిసి ఒక వెబ్ సిరిస్ చేశారు. అది ఇంగ్లీష్ లో కూడా డబ్ అవుతుంది. అది వరల్డ్ వైడ్ షో అయ్యే ఛాన్స్ కూడా వుంది. ఆడియన్స్ నచ్చే ఎంటర్ టైన్ మెంట్ ని ఎక్కడున్నా తప్పకుండా చూస్తారు.

అభిరామ్ సినిమా గురించి ?

నిజానికి అభిరామ్ యాక్టర్ అవుతాడని అనుకోలేదు. నాకు చాలా వ్యాపారాలు వున్నాయి. అవి చుసుకోమంటే.,. ”తాత నన్ను యాక్టర్ అవ్వమని చెప్పారు నేను యాక్టర్ అవుతా” అన్నాడు. కిరణ్, తేజ తో కలసి చేస్తున్నాడు. మంచి డేట్ కోసం చూస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఫైనల్ కాపీ చూడాలి.

కొత్త సినిమాల గురించి?

కొన్ని సినిమాల పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రకటనలు వస్తాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narappa Movie Review
  • #Priyamani
  • #Sreekanth Addala
  • #Suresh Babu
  • #Venkatesh

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

5 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

5 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

6 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

8 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

9 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

10 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

11 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

13 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

14 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version