Suresh Babu: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అగ్ర నిర్మాత!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఇప్పటికే చాలా మంది నటీమణులు ఓపెన్ అయ్యారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు సినీ పెద్దలెవరూ సరిగ్గా స్పందించలేదు. కానీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి కథ కాదని.. గత కొన్నేళ్లుగా పురాణాల నుండి వస్తోన్న అలవాటని అన్నారు. దేశానికి రాజైన వాడు.. అక్కడ దొరికే నగలు, డబ్బులతో పాటు అక్కడున్న ఆడవాళ్లని చెడగొట్టడం లాంటివి అతడి జీవితంలో భాగమని.. అది రానురాను రూపాంతరం చెందిందని సురేష్ బాబు అన్నారు.

ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు భార్యలున్నా ఎవరూ పట్టించుకునేవారు కాదని.. కానీ మహిళలు ప్రశ్నించడం మొదలుపెట్టాక ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయడం లేదని.. మహిళలు ఇండిపెండెంట్ గా సొసైటీలో బ్రతకగలరని.. అందుకే పరిస్థితులు మారాయని.. ఏది ఏమైనా మహిళలను లోబరుచుకోవడం లాంటి వాటిని యాక్సెప్ట్ చేయకూడదని.. ఆడవాళ్లను మోసం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. మహిళ ఎలాగైతే తన భర్తే లోకంగా ఉంటుందో.. భర్త కూడా అంతే నిజాయితీగా ఉండాలని చెప్పారు. అందుకే తను స్ట్రెయిట్ లైఫ్ లీడ్ చూస్తుంటానని అన్నారు.

మీపై నెగెటివ్ న్యూస్ ఎందుకు రాదని గతంలో ఓ ఇంటర్వ్యూలో అడిగారని.. ఒక భర్తగా నా భార్యను నేను ఛీట్ చేయనని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఈరోజుల్లో అమ్మాయిలు అగ్రెసివ్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటున్నారని.. అలానే దెయ్యాలు, దరిద్రులు కూడా ఇంకా ఉన్నారని అన్నారు. పాకిస్థాన్, సౌదీ లాంటి దేశాల్లో అమ్మాయిలను రేప్ చేసే వాళ్లను కాల్చి చంపేస్తున్నారని.. కానీ అక్కడ కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. ఎక్కడా ఆగిపోలేదని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus