టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు సినిమాల డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయని.. భారీ మొత్తానికి నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాలను అమ్మేసినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. రీసెంట్ గా కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద సినిమాల విడుదలను ఓటీటీ రిలీజ్ చేస్తే ఊరుకోమంటూ మండిపడ్డారు.
దీని వలన థియేటర్ ఇండస్ట్రీ నాశనమైపోతుందని.. కాబట్టి నిర్మాతలు సినిమాలకు థియేటర్లోనే విడుదల చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సురేష్ బాబు పునరాలోచనలో పడినట్లు.. ‘నారప్ప’ ఓటీటీ డీల్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని సమాచారం. ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేయనున్నారట. ఈ నెల 24న సినిమాను విడుదల చేయడానికి ముహూర్తం కూడా ఖరారైందట.
అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి యాడ్స్ కూడా రెడీ చేసిందని.. ఈ సినిమా డీల్ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదని సమాచారం. మరి దీనిపై ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి!
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!