హీరో సూర్య కుటుంబం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. గత ఏడాది జ్యోతిక నటించిన రాచ్ఛసి మూవీ అనేక వివాదాలకు కారణం అయ్యింది. విద్యా వ్యస్థలో లోపాలను ప్రశ్నిస్తూ తెరకెక్కిన ఆ చిత్ర ప్రదర్శన ఆపివేయాలని తమిళనాడు ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు చేశాయి. గవర్నమెంట్ టీచర్స్ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నారు, పిల్లలు చెడిపోవడానికి టీచర్స్ కారణం అని ఆ సినిమాలో చెప్పగా..అదో పెద్ద విషయం అయ్యింది. ఇక ఆమె నటించిన పోన్ మగళ్ వందాళ్ మూవీని డైరెక్టర్ గా ఓ టి టి విడుదల చేయాలని సూర్య తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది.
థియేటర్స్ యాజమాన్య సంఘాలు సూర్యని బెదిరించడం జరిగింది. అయినా సూర్య వారి మాటలు లెక్క చేయకుండా, ప్రైమ్ లో ఆ మూవీ విడుదల చేశారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్ హౌస్‌లు ఇస్తారని, సామాన్యులకు కనీసం దర్శనం కల్పించకుండా తోసేస్తారని శివకుమార్ ఆరోపణలు చేశారు. అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు . ఈ నేపథ్యంలో టీటీడీపై శివకుమార్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని..
ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.. ఈ విధంగా సూర్య కుటుంబం వరుస వివాదాలలో చిక్కుకుంటుంది. మరి సూర్య ఫ్యామిలీకి మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు.