Kanguva, Kalki: ‘కల్కి 2898 AD’ రికార్డును బ్రేక్ చేసిన ‘కంగువా’ గ్లింప్స్

కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ’24 ‘ తర్వాత సూర్య నుండి వచ్చిన సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ‘గ్యాంగ్’ ‘బందోబస్త్’ .. ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే కోవిడ్ టైంలో ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి సినిమాలతో సక్సెస్ లు అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు సూర్య. ఆ సినిమాలకి సూపర్ రెస్పాన్స్ లభించింది. దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.

అయితే అటు తర్వాత వచ్చిన ‘ఈటి’ (ఎవరికీ తలవంచకు) చిత్రం నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సాధించింది. సూర్య ఇప్పుడు ‘కంగువా’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.’సిరుతై’ శివ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కంగువా’ సినిమా గ్లింప్స్.. ఇటీవల రిలీజ్ అయ్యింది. దీనికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇందులోని విజువల్స్ అన్నీ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సూర్య పలికించిన హావభావాలు కూడా ఇంప్రెస్ చేశాయి.

చాలా కాలం తర్వాత దేవి శ్రీ ప్రసాద్ తన స్థాయికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ అందించాడు అని అంతా ప్రశంసలు కురిపించారు. ఎప్పుడూ రొటీన్ మాస్ సినిమాలు తీసే దర్శకుడు శివలో ఇంత అద్భుతమైన విజన్ ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ‘కంగువా’ గ్లింప్స్ ఇప్పుడు ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ (Kalki) ‘కల్కి’ గ్లింప్స్ 21 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టగా… ‘కంగువా’ గ్లింప్స్ 30 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి అందరికీ షాకిచ్చింది. ఇక కంగువా సినిమా కూడా 10 కి పైగా భాషల్లో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus