Sushmita Sen: సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణమిదా?

ఈ మధ్య కాలంలో వివాదాస్పద విషయాల ద్వారా హీరోయిన్ సుస్మితా సేన్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. లలిత్ మోదీతో సుస్మితా సేన్ ప్రేమలో ఉందని వార్తలు వైరల్ కావడంతో ఆమెను చాలామంది ట్రోల్ చేశారు. నెటిజన్లు సుస్మితా సేన్ ను ఈ విషయాలకు సంబంధించి దారుణంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా సుస్మితా సేన్ పలువురితో డేటింగ్ చేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి గురించి స్పందించిన

సుస్మితా సేన్ నేను నా లైఫ్ లో చాలామంది ఆసక్తికరమైన పురుషులను కలిశానని చెప్పుకొచ్చారు. ఆ పురుషులలో నెలకొన్న నిరాశ, నిరుత్సాహం నన్ను పెళ్లి చేసుకోకుండా చేసిందని సుస్మితా సేన్ కామెంట్లు చేశారు. నేను ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో నా పిల్లలు కూడా వాళ్లను మనస్పూర్తిగా ఆహ్వానించారని సుస్మితా సేన్ వెల్లడించారు. నా పిల్లలు అలా చేయడం కొత్తగా, సంతోషంగా అనిపించిందని సుస్మితా సేన్ చెప్పుకొచ్చారు.

నా జీవితంలో మూడుసార్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని అయితే విధి వల్ల బయటపడ్డానని సుస్మితా సేన్ కామెంట్లు చేశారు. నన్ను, నా పిల్లలను దేవుడు సురక్షితంగా చూసుకుంటాడని నమ్మకం నాకుందని సుస్మితా సేన్ అన్నారు. సుస్మితా సేన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుస్మితా సేన్ గతంలో ఇద్దరు ఆడపిల్లలను దత్తత చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. 24 సంవత్సరాల వయస్సులో సుస్మితా సేన్ రీనా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

2010 సంవత్సరంలో సుస్మితా సేన్ అలీషా అనే మరో అమ్మాయిని దత్తత తీసుకోవడం గమనార్హం. సుస్మితా సేన్ తన గురించి, తన పెళ్లి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. సుస్మితా సేన్ కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus