Sushmita Sen: తన గుండెపోటు గురించి చెప్పిన సుస్మితా సేన్‌.. చాలా ఇబ్బందే!

ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఏమైందో పూర్తిగా తెలియకపోయినా.. ఆమెకు అయితే అస్వస్థత కాస్త ఇబ్బంది పెట్టేదే అని మాత్రం తెలిసింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకున్నారు. తాజాగా సుస్మితా సేన్‌ తన ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. తనకు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది వంటి వివరాలు తెలియజేశారు. ప్రధాన రక్తనాళం చాలా వరకూ మూసుకుపోయిందని సకాలంలో వైద్యులు చికిత్స చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని సుస్మితా సేన్‌ తెలిపారు.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన వారికి, తాను తిరిగి కోలుకోవడాకి కృషి చేసిన వైద్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మాట్లాడటానికి గొంతు సహకరించడం లేదు. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వీడియో షేర్‌ చేస్తున్నా అని ఆమె ఆ వీడియోలో చెప్పారు.‘‘నా గొంతు విని అనారోగ్యంగా ఉన్నానని అనుకోకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నా. ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యాను.

ప్రధాన రక్తనాళం 95 శాతం వరకు మూసుకుపోయిందని వైద్యులు చెప్పారు. ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. ఈ విషయం నా కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే తెలుసు. చికిత్స సమయంలో నా అనారోగ్యం గురించి ఎవరితోనూ చెప్పాలనుకోలేదు’’ అని చెప్పారు సుస్మిత. నా చికిత్స పూర్తియి.. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాను. అంతే కాదు త్వరలోనే ‘ఆర్య 3’ షూట్‌లో పాల్గొంటాను అంటూ తన ప్రొఫెషన్‌ అప్‌డేట్‌ కూడా ఇచ్చేశారు.

ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సుస్మిత.. త్వరలోనే. వారి నుండి క్లియరెన్స్ తీసుకుని జైపూర్‌ వెళ్లి షూటింగ్‌లో పాల్గొంటారు. 2020లో వచ్చిన ‘ఆర్య’ సిరీస్‌కు ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. రెండు సీజన్లు మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక మూడోది కూడా అదే రేంజిలో ఉంటుంది అంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus