టాలీవుడ్ లో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు కానీ…వారందరిలో దిల్ రాజు గారి రూటే సేపరేటు. ఆయన ఎప్పుడు ఎలా ఏం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు….ఫుల్ మాసాల సినిమా హవా నడుస్తున్న కాలంలో ఒకేసారిగా సిద్దార్ధ్ లాంటి యువ హీరోతో “బొమ్మరిల్లు” సినిమాను నిర్మించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత వరుసగా హిట్స్ ఇచ్చుకుంటూ….
అప్పుడెప్పుడో ఎన్టీఆర్-ఎన్నార్ కాలంలో మరచిపోయిన ముల్టీ స్టారర్ చిత్రాలను మళ్ళీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో” ప్రేక్షక లోకానికి పరిచయం చేశారు…ఇలా ప్రతీదీ చాలా డిఫరెంట్ గా ప్లా చేస్తున్న దిల్ రాజు…తాజాగా శర్వానంద్ హీరోగా “శతమానం భవతి” అన్న సినిమాను నిర్మిస్తున్నాడు…నిన్న దసరా సంధర్భంగా విడుదలయైన ఫర్స్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ చూడడానికి చాలా అందంగా, నిండుగా ఉన్నాయి కానీ..ఎక్కడో ఏదో….తెలియని సందేహం….ఇంతకీ ఏంటి ఆ సందేహం అంటే….ఈ సినిమా పోస్టర్ చూడగానే….మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది.
కాకపోతే టీజర్ ను చూస్తుంటే మాత్రం చాలామందికి ఒక ఫీలింగ్ కలిగింది. ఇందులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫ్లేవర్ బాగా కనిపించింది. అయితే ఆ సినిమాకు ఈ సినిమాకి చాల్ డిఫరెన్స్ కనిపిస్తుంది….అందుకొండి…ఆ సినిమాలో అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఈ సినిమాలో హీరొ ఒక్కడే…ఇక ప్రకాష్ రాజ్, జయసుధ పాత్రలు మర్సారి సీతమ్మ వాకిట్లో సినిమాను గుర్తు చేశాయి. మరి ఇంత ప్లేసెంట్ గా…సైలెంట్ లవ్ స్టోరీ లా కనిపిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.