Teja Sajja: మరో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ‘హనుమాన్’ హీరో.!

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా (Teja Sajja) ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత రూపొందిన రెండో చిత్రం ‘హనుమాన్’ (Hanu Man). ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు సాధించి నిర్మాతకు , బయ్యర్లకు భారీ లాభాలను అందించింది. రివార్డులే కాదు.. అవార్డుల విషయంలోనూ హనుమాన్ సత్తా చాటింది. ఈ చిత్రంలో నటనకు గాను రెండ్రోజుల క్రితం దాదా సాహెచ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్ 2024 ఆయనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది.

Teja Sajja

తాజాగా ‘ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో తేజా సజ్జాను ఉత్తమ నటుడిగా ప్రకటించారు. తద్వారా హనుమాన్ చిత్రానికి వరుసగా రెండు ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు తేజా సజ్జా. ఈ మూవీలో హనుమంతు పాత్ర కోసం ఎంతో కష్టపడ్డ ఈ కుర్రాడు దానికి తగ్గ ప్రతిఫలం పొందాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తేజా సజ్జా ఎన్నో చిత్రాల్లో స్టార్ హీరోలకు కొడుకుగా లేదంటే స్టార్ హీరో చిన్నప్పటి పాత్రలు చేశాడు.

చిన్న వయసులోనే నంది అవార్డ్ సహా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను అందుకున్నాడు. జాంబీ రెడ్డితో హీరోగా పరిచయమైన తేజా సజ్జా ఆ వెంటనే ‘అద్భుతం’లో (Adbhutham) నటించాడు. అనంతరం ప్రశాంత్ వర్మతో జత కట్టి హనుమాన్ చేశాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నెక్ట్స్ హనుమాన్ 2ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యేలా ఉండటంతో కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో ‘మిరాయ్’ (Mirai) చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మంచు మనోజ్‌ (Manchu Manoj)లు కూడా కీలకపాత్రలు పోషించనున్నారని ఫిలింనగర్ టాక్.

 ‘సత్యం సుందరం’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus