Swag First Review: శ్రీ విష్ణు ‘శ్వాగ్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

[Click Here For Review]

 

యువ కథానాయకుడు శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా రూపొందిన ‘శ్వాగ్’ (Swag)  అక్టోబర్ 4న అంటే రేపు రిలీజ్ కాబోతుంది. హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను శ్రీవిష్ణుతోనే ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora)  అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోతున్న ‘శ్వాగ్’ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్.. డిఫరెంట్.. గా, అదే సమయంలో ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి.

SWAG

కథపై మాత్రం ఇవి ఓ క్లారిటీ ఇచ్చింది లేదు. ఇదిలా ఉంటే.. ఆల్రెడీ కొంతమందికి ‘శ్వాగ్’ చిత్రం స్పెషల్ షోలు వేయడం జరిగింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది శ్వాగనిక వంశానికి చెందిన కథ అని, ఆడవాళ్ళు ఎక్కువా? మగవాళ్ళు ఎక్కువా? అనే కాన్ఫ్లిక్ట్ పాయింట్ తో స్క్రీన్ ప్లేని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. శ్రీవిష్ణు 4 రకాల గెటప్లలో కనిపించి.. అలరించాడట.

వృద్ధుడి గెటప్లో కూడా జీవించినట్టు తెలుస్తుంది. రీతూ వర్మ కూడా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అలరించింది అని తెలుస్తుంది. కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందట. సెకండ్ హాఫ్ చాలా కీలకంగా ఉంటుందట. హాసిత్ గోలి (Hasith Goli)   టేకింగ్ కొత్తగా.. ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus