Swapna Dutt, Jr NTR: స్వప్న దత్ పెళ్లి విషయంలో ఎన్టీఆర్ చేసిన హెల్ప్ ఏంటంటే..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కు నందమూరి ఫ్యామిలీకి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అశ్వినీ దత్ గారి ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అశ్వినీదత్… ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘కంత్రి’ ‘శక్తి’ వంటి చిత్రాలను నిర్మించారు. ఇదిలా ఉండగా.. నిజ జీవితంలో జూనియర్ ఎన్టీఆర్.. దత్ గారి కుటుంబంతో చాలా సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా.. దత్ గారి రెండో అమ్మాయి, ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్న స్వప్న దత్ పెళ్లి విషయంలో కూడా ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడట. స్వప్న దత్ ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించింది. 2010 డిసెంబర్ 19న వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు నవ్య వైజయంతి అనే కుమార్తె కూడా ఉంది. ఇక ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘నీ పెళ్లి జరగడంలో కీలక పాత్ర వహించిన ఎన్టీఆర్ గురించి ఆ కథ గురించి చెప్పండి ఒకసారి?’ అంటూ యాంకర్ ప్రశ్నించగా…

అందుకు స్వప్న దత్ స్పందిస్తూ.. “నా లవ్ మేటర్ వర్కౌట్ అవ్వడం లేదులే, కొంచెం గ్యాప్ తీసుకుందాం అని నేను అనుకుంటున్న టైంలో ఎన్టీఆర్ వచ్చి నాన్నగారిని(అశ్వినీ దత్) కన్విన్స్ చేశాడు. ‘ఇలాంటి విషయాలు ఎక్కువ డిలే చేయకూడదు నేను వచ్చి మాట్లాడతాను’ అంటూ షూటింగ్ మధ్యలోనే, మేకప్ కూడా తీయకుండా వచ్చి నాన్న గారితో మాట్లాడాడు. నా జీవితంలో ఎన్టీఆర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.

తనని కానీ, తను చేసిన సాయాన్ని కానీ నేను లైఫ్ లో మర్చిపోలేను. మా బ్యానర్లో అతను సినిమా చేసినా.. చేయకపోయినా కూడా చాలా క్లోజ్ గా ఉంటాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆడియో లాంచ్ కు అతను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. కానీ తర్వాత ఆఫీస్ కి వచ్చి అందరినీ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మా మధ్య అంత బాండింగ్ ఉంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus