Swapna Dutt, Prabhas: కల్కిలో ప్రభాస్ రోల్ పై అంచనాలు పెంచిన స్వప్నాదత్.. ఆ కామెంట్లతో?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ చెప్పిన తేదీకి థియేటర్లలో విడుదలవుతుందో లేక మరో కొత్త తేదీకి విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన స్వప్నాదత్ (Swapna Dutt) ఒక సందర్భంలో మాట్లాడుతూ కల్కి మూవీలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆమె ఈ కామెంట్లు చేశారు. కల్కి 2898 ఏడీ విడుదలైన తర్వాత ప్రభాస్ పోషిస్తున్న భైరవ రోల్ చాలా కాలం పాటు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోతుందని స్వప్నాదత్ అన్నారు.

ఈ వీడియోను ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త ప్రపంచం పరిచయం చేస్తాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి సైతం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అతి త్వరలో కల్కి సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని సమాచారం అందుతోంది.

కల్కి సినిమా పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుండగా విదేశీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. కల్కి సినిమా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నైజాం రైట్స్ ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఆంధ్ర, సీడెడ్ ఏరియాలలో సైతం ఈ సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.

కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి సినిమా రిలీజైన తర్వాత ప్రభాస్ తర్వాత సినిమాల ప్రమోషన్స్ మొదలు కానున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus