Syed Sohel: బిగ్ బాస్ సోహైల్ కి మాతృ వియోగం.!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ప్రముఖ నటీనటులు, దర్శకనిర్మాతల లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. పక్క భాషలకు చెందిన ప్రముఖులు కూడా ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా మరో విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. సోహైల్ (Syed Sohel) తల్లి ఫైమా సుల్తానా ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. హైదరాబాద్లోని, హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు సమాచారం.

Syed Sohel

ఫైమా సుల్తానా గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తుందట. ఇటీవల డయాలసిస్ నిమిత్తం ఆమెను మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయగా… పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆమె కన్నుమూసినట్లు సమాచారం. దీంతో సోహైల్ అలాగే అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది అని తెలుస్తుంది.సోహైల్ కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. అతనికి తండ్రి సయ్యద్ సలీం, తల్లి, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు.

ఇక సోహైల్ తల్లి ఫైమా సుల్తానా పార్థివ దేహాన్ని అంత్యక్రియలు నిమిత్తం ఇప్పుడు కరీంనగర్ తరలిస్తున్నట్లు సమాచారం. ఇక సోహైల్ ‘కొత్త బంగారులోకం’ (Kotha Bangaru Lokam) సినిమాతో నటుడిగా కెరీర్ ని స్టార్ట్ చేసి తర్వాత ‘యురేక’ వంటి సినిమాల్లో నటించాడు. ‘బిగ్ బాస్ 4’ ద్వారా ఇతను మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman), ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ (Organic Mama Hybrid Alludu) , ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ (Mr. Pregnant), ‘బూట్ కట్ బాలరాజు’ (Bootcut Balaraju) వంటి సినిమాలు చేశాడు.

మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus