ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ ఈ సినిమా ద్వారా ఈమె నటిగా మంచు గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అనంతరం తెలుగులో ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో ఈమె కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి తాప్సీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించినటువంటి తాప్సీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన మొదటి ప్రేమ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాను 9వ తరగతి చదువుతున్న సమయంలోనే 10వ తరగతి అబ్బాయితో తాను ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే మా రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగలేదని ఈమె తన తొలి ప్రేమ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సెల్ ఫోన్స్ లేకపోవడంతో మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి టెలిఫోన్ బూతు దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయికి ఫోన్ చేశాను కానీ తను మాత్రం నా ప్రేమను మర్చిపోమని తాను చదువు పై దృష్టి పెట్టానని చెప్పారు.
ఇలా నా (Taapsee) తొలిప్రేమ ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని ఆరోజు ఆ అబ్బాయి అలా మాట్లాడటంతో నేను ఎంతో ఏడ్చానని తాప్సీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక తన జ్ఞాపకాల నుంచి నేను బయటపడటానికి కొన్ని నెలల సమయం పట్టింది అంటూ తెలియచేయడమే కాకుండా తొలిప్రేమ ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే అంటూ అప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.