నాగార్జున వందో సినిమా గురించి ఎన్నో నెలలుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు అనే వార్తలొచ్చినా.. అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఏమైంది మోహన్ రాజా సినిమాలా ఈ సినిమా కూడా పక్కకు వెళ్తుందా అనే డౌటనుమానం వచ్చింది కొంతమందికి. అయితే వారందరికీ షాక్ ఇస్తూ.. ఎలాంటి అట్టహాసం లేకుండా తన వందో సినిమాను నాగార్జున ఇటీవల లాంఛనంగా ప్రారంభించేశారు. ఇప్పుడు ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఓ లీక్ బయటకు వచ్చింది.
నాగార్జున – టబు జోడీ టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ చేసినప్పుడు ఆ మ్యాజిక్ మళ్లీ కనిపించింది. ఇప్పుడు మూడోసారి ఇద్దరూ హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు అని టాక్. అదే నాగ్ వందో సినిమా. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలను తీసుకోవాలని దర్శకుడు రా.కార్తిక్ అనుకుంటున్నారట. అందులో ఓ సీనియర్ హీరోయిన్ అవసరం కాగా.. టబును సంప్రదించారు అని సమాచారం. నాగ్ సినిమా అంటే ఆమె నో చెప్పే అవకాశమే లేదు.
#King100 అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాగార్జునను కింగ్ అని అభిమానులు పిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన సినిమాకు ‘లాటరీ కింగ్’ అని పెట్టడం వల్ల పేరు, సినిమా కాన్సెప్ట్ రెండూ వర్కవుట్ అయితాయని భావిస్తున్నారట. మరి నాగార్జున ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పూర్తిస్థాయి యాక్షన్, ఎలివేషన్ సీన్స్‌తో ఈ సినిమాను నింపేయబోతున్నాం అని ఆ మధ్య నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా.
ఇక వందో సినిమా కాబట్టి.. ఈ సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్‌లు కూడా ఉంటాయి అని సమాచాం. కుటుంబ సభ్యులు కీలక సమయంలో అతిథి పాత్రలుగానో, లేదంటో ఓ మాంటేజ్ సాంగ్‌లోనే కనిపిస్తారని సమాచారం.