సిద్ధార్థ్ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా రూపొందిన మూవీ ‘టక్కర్’. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’, ‘పాషన్ స్టూడియోస్’ తో కలిసి టి.జి విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓకే అనిపించాయి.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వంటి బడా సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంతో సిద్దార్థ్ కు ఓ హిట్ పడటం గ్యారెంటీ అని అంతా భావించారు.
కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.రెండో రోజు కూడా ఈ మూవీ పుంజుకోలేకపోయింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.17 cr
సీడెడ్
0.08 cr
ఆంధ్ర
0.19 cr
ఏపీ+ తెలంగాణ టోటల్
0.44 cr
‘టక్కర్’ (Takkar)చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో రెండు రోజుల్లో కేవలం రూ.0.44 కోట్ల షేర్ మాత్రమే నమోదైంది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో అయితే లేవు. ఈ నేపథ్యంలో వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.