Parasuram: ఆ హీరో మూవీతో పరశురామ్ గీతా గోవిందం రేంజ్ సక్సెస్ సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో పరశురామ్ (Parasuram) ఒకరు కాగా వరుస విజయాలను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్న ఈ దర్శకుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జోరుకు సైతం ఈ సినిమా బ్రేకులు వేసిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అయితే పరశురామ్ కొత్త సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది.

Parasuram

సిద్ధు జొన్నలగడ్డ వరుస విజయాలతో కెరీర్ పరంగా జోరుమీదున్నారు. డీజే టిల్లు (DJ Tillu) , టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాల విజయాలు సిద్ధు ఇమేజ్ ను మార్చేయడంతో పాటు సక్సెస్ రేట్ ను పెంచేశాయి. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అని అభిమానులు ఫీలవుతారనే సంగతి తెలిసిందే. టిల్లు హీరోతో పరశురామ్ ఏ రేంజ్ హిట్ సాధిస్తాడో చూడాలి.

యూత్ యువరాజ్ గా ఇండస్ట్రీలో సిద్ధు జొన్నలగడ్డకు పేరు ఉండగా ప్రస్తుతం తెలుసు కదా సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లతో ఈ హీరో బిజీగా ఉన్నారు. సిద్ధు పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. నైజాంలో ఈ హీరో సినిమాలు కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిద్ధు పాన్ ఇండియా హీరోగా సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

సిద్ధు కామెడీ టైమింగ్ అతని సినిమాలకు ఎంతో ప్లస్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ పరశురామ్ కాంబో మూవీని దిల్ రాజు నిర్మించే ఛాన్స్ ఉందని భోగట్టా. సిద్ధుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. దిల్ రాజు (Dil Raju) గతంలోనే పరశురామ్ కు మాట ఇచ్చారని ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారని తెలుస్తోంది. పరశురామ్ ఈ సినిమాకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సిద్ధు మూవీతో పరశురామ్ గీతా గోవిందం (Geetha Govindam) రేంజ్ హిట్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాకి ఇలాంటి తిప్పలు ఏమిటో.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus