Tamanna: ప్రభాస్ సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ వస్తే మిస్ చేసుకుని బాధపడుతున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన రెండు పెద్ద సినిమాలు గత వారం రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి చిరంజీవి సరసన చేసిన ‘భోళా శంకర్’,మరొకటి రజినీకాంత్ తో చేసిన ‘జైలర్’. ‘భోళా శంకర్’ లో తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ‘జైలర్’ లో ఆమె హీరోయిన్ రోల్ కాదు. ఓ పావుగంట లేదా 20 నిమిషాలు వచ్చి వెళ్లిపోయే పాత్ర అనుకోవచ్చు. ఈ రెండు సినిమాల్లోనూ తమన్నా రోల్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సరే ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాల ప్రమోషన్స్ లో తమన్నా ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన తమన్నా.. బిజీ షెడ్యూల్ వల్ల ఏదైనా హిట్ సినిమాని మిస్ చేసుకున్న సందర్భం ఉందా అని అడగ్గా.. అందుకు ఆమె ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అని సమాధానం ఇచ్చింది. ఆ సినిమాలో నటించే ఛాన్స్ ఈమెకు వచ్చిందట.

కానీ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆ సినిమాని మిస్ చేసుకున్నట్టు తమన్నా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటానని, టీవిలో ఆ సినిమా చూస్తుంటే ఏదో ఒక రకంగా కాల్ షీట్లు అడ్జస్ట్ చేసుకుని చేసుండాల్సింది’ ఆమె బాధపడింది.

అయితే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రభాస్ సరసన కాజల్, తాప్సి నటించారు. మరి ఈ ఇద్దరి పాత్రల్లో తమన్నా మిస్ చేసుకున్న పాత్ర ఏమిటనేది చెప్పలేదు.. కానీ ఇన్సైడ్ సోర్స్ ప్రకారం.. తాప్సీ పాత్రని ఈమె మిస్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆ సినిమాల తర్వాత తమన్నా (Tamanna) ప్రభాస్ కి ‘రెబల్’ ‘బాహుబలి’ ‘బాహుబలి 2 ‘ సినిమాల్లో నటించింది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus