ఈ మధ్యకాలంలో సినిమాల్లో బూతు కంటెంట్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాల్లో ఒక్క బూతు పెట్టాలన్నా చాలా ఆలోచించేవారు. సీన్ డిమాండ్ చేస్తే తప్ప బూతుల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా సినిమాల్లో బూతులు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ల ప్రభావం సినిమాలపై బాగా పడుతోంది. ఓటీటీల్లో వస్తోన్న వెబ్ సిరీస్ లలో బూతుల గురించైతే చెప్పనక్కర్లేదు. ఇవి ఓ వర్గం ప్రేక్షకులకు అసలు రుచించడం లేదు. సెన్సార్ ఉండదు కాబట్టి..
ఓటీటీ కంటెంట్ ను చాలా వరకు సెలెక్టివ్ గా, వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ థియేటర్లలో ఫ్యామిలీతో చూసే సినిమాల్లో బూతుల విషయంలో కచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే. అయితే ‘సీటీమార్’ అనే మాస్ సినిమాలో హీరోయిన్ తమన్నా నోటి నుంచి వచ్చిన బూతు మాట అందరికీ షాకిచ్చింది. సినిమాలో తమన్నా జ్వాలా రెడ్డి అనే తెలంగాణ అమ్మాయి పాత్రను చేసింది. ఈ జెనరేషన్ కి తగ్గట్లుగా ఆ పాత్రను చాలా అగ్రెసివ్ గా చూపించాలనుకున్నాడు దర్శకుడు సంపత్ నంది.
ఈ క్రమంలో ఆమెతో ‘లం.. కొడుకు’ అనే బూతు మాట చెప్పించాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ స్వయంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఆమె నోట ఇలాంటో బూతు మాట వచ్చేసరికి అభిమానులు షాకయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాల్లో ఇలాంటి బూతులు పెట్టాల్సిన అవసరం ఏముందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.