టాలీవుడ్ గేమ్ చేంజర్ మూవీ అయిన ‘అర్జున్ రెడ్డి’ ను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్ హీరో కాగా సందీప్ రెడ్డి వంగనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ తమిళ రీమేక్ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. మొదట ఈ రీమేక్ ను బాల డైరెక్షన్లో మొదలయ్యింది. ఈ చిత్రం పూర్తయిన తరువాత ఔట్ ఫుట్ సరిగా రాలేదనే కారణంతో ఆగిపోయింది.
ఈ తమిళ రీమేక్ తో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్నాడు. తన కెరీర్లో ఇబ్బందుల్లో పడకూడదని ఆలోచించి విక్రమ్ నే దర్శకుడి బాలాను తప్పించి అయన స్థానంలో తెలుగు వెర్షన్ కోసం పనిచేసిన గిరీశాయ ను తీసుకున్నాడు. ఇక హీరోయిన్ గా హిందీ అమ్మాయి బాణిత సంధును తీసుకున్నారు. తరువాత ఈ చిత్రం ఎటువంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరో ధృవ్ అండ్ టీమ్ 50 రోజుల పాటు విరామం లేకుండా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయట. ఇక ఈ చిత్రం బాగా వచ్చిందని చిత్ర యూనిట్ బలమైన నమ్మకంతో ఉన్నారట.