నేచురల్ స్టార్ నాని హీరోగా.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డాన్స్ లతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. అయితే దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పాత్రలో కథనం ప్రచురించగా..
అది వివాదానికి దారి తీసింది. టాలెంటెడ్ హీరోయిన్ పై బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. సాయిపల్లవిపై బాడీషేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆమె.. ”నేను కూడా నా రూపం విషయంలో చాలాసార్లు ట్రోలింగ్ కి గురయ్యాను. అయితే అలాంటి వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎగతాళి చేసేవారికేం తెలుస్తుంది..
ఆ మాటలు ఎదుటివారిని ఎంతగా బాధిస్తాయో. అలాంటి మాటలకు నేను చాలా బాధపడ్డాను. కానీ నా టాలెంట్, కష్టంతో వాటిని ఎదుర్కొన్నాను” అంటూ చెప్పుకొచ్చారు. అలానే ఏ సమాజంలో స్త్రీలే ఎక్కువగా బాడీ షేమింగ్ కి గురవుతుంటారని.. మగాళ్లను మాత్రం 50 ఏళ్ల వయసులో కూడా యువకుల్లా చూస్తుంటారని మండిపడ్డారు. మహిళల ఎదుగుదలను ఆపలేని ఈ సమాజం వారిని బాధపెట్టడం ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని.. అందుకే స్త్రీలు ఇలాంటి మాటలను పట్టించుకోవడం మానేసి మానసికంగా బలంగా మారాలని చెప్పుకొచ్చారు.
In a live TV interview today, highlighted on Body-Shaming & its impact on women.