టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఎన్నో సినిమాలలో నటించి సందడి చేశారు. అయితే ఈయన ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సినిమా ఇండస్ట్రీలో జరిగే పరిణామాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరో అర్జున్ యంగ్ హీరో విశ్వక్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ వివాదంపై ఇప్పటికే అర్జున్ విశ్వక్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి పూర్తిగా విశ్వక్ తప్పుకోగా అర్జున్ సైతం మరొక హీరో కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదం గురించి తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ ఒకసారి హీరో సినిమాకు కమిట్ అయిన తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకోవడం అంటే పూర్తిగా దర్శక నిర్మాతలను అవమానించడమేనని ఈయన వెల్లడించారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు ఎక్కువ ఆటిట్యూడ్ చూపిస్తున్నారని
ఈ ఆటిట్యూడ్ కారణంగానే సినిమాలు ప్లాప్ అవుతున్నాయని ఈయన మండిపడ్డారు. ముఖ్యంగా ఒకసారి కథ ఫైనల్ అయిన తర్వాత సినిమాకు కమిట్ అయిన తర్వాత ఆ సినిమాలో నటించడమే హీరో వంతు అంటూ ఈయన తెలియజేశారు.సినిమా కథ నచ్చలేదు మ్యూజిక్ డైరెక్టర్ నచ్చలేదు రెమ్యూనరేషన్ నచ్చలేదు అంటూ సినిమా నుంచి తప్పుకోవడం పూర్తిగా తప్పని తెలిపారు. ఈ విధమైనటువంటి అభ్యంతరాలు ఉంటే ముందుగానే చర్చించుకోవాలి కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా చేయకూడదు.
ఇకపోతే యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఇలా జోక్యం చేసుకోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఈయన తెలిపారు.ఇప్పటికీ సీనియర్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ చిరంజీవి వంటి వారు ఒకసారి కథ ఫైనల్ అయిన తర్వాత దర్శకులు చెప్పిన విధంగానే నడుచుకుంటారు కానీ యంగ్ హీరోలు అలా కాదంటూ ఈయన హీరోలకు తనదైన శైలిలో చురకలాంటించారు.