యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని గూగుల్ ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సీఎం చెయ్యడానికి వారెవరూ.. దాన్ని చూసి సంబరాలు ఏంటని తలపట్టుకోకండి. అసలు విషయంలోకి వెళితే.. సెర్చ్ ఇంజిన్ గూగుల్ లోని ఫీచర్స్ లో ట్రాన్స్ లేటర్ ఒకటి ఉంది.
ఇందులో మనం ఒక పదాన్ని టైపు చేసి ఏ భాషలో నైనా మార్చుకునే వెసులు బాటు ఉంది. దీనిని భాష, ప్రాంతం అని భేదం లేకుండా అనేకమంది ఉపయోగిస్తుంటారు. తాజాగా ఇందులో tarak అని టైప్ చేసి టర్కిష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ లేట్ చెయ్యమని కోరితే ‘ముఖ్యమంత్రి’ అని చూపిస్తోంది. ఈ విషయం తెలుసుకుని తారక్ అభిమానులు ఆనందపడ్డారు.
గూగుల్ నోటి మాట నిజం కావాలని కోరుకుంటున్నారు. తాత నందమూరి తారక రామారావు అశీసులతో ఎదుగుతున్న చిన్న రామయ్య.. తాత లాగే ముఖ్యమంత్రి అయి పేదల కష్టాలని తీరుస్తారని ఆశిస్తున్నారు.