ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాల్లేకుండా ఆయా సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నగరానికి ఏమైంది సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అవుతుండగా ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం టికెట్లు బుకింగ్ చేసుకోవాలని ప్రయత్నించే వాళ్లకు సోల్డ్ ఔట్ ఆప్షన్ కనిపిస్తుండటంతో వాళ్లు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సినిమా టికెట్లను బ్లాక్ చేశారని అందుకే తమకు టికెట్లు దొరకడం లేదని కొంతమంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పై ఫైర్ కావడం జరిగింది.
అయితే వైరల్ అవుతున్న కామెంట్స్ తన దృష్టికి రావడంతో తరుణ్ భాస్కర్ స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తరుణ్ భాస్కర్ తన ట్విట్టర్ ద్వారా నెగిటివ్ కామెంట్లకు, పాజిటివ్ కామెంట్లకు తన శైలిలో బదులిచ్చే ప్రయత్నం చేశారు. బాయ్స్, గర్ల్స్ ఏంటీ మ్యాడ్నెస్ అంటూ తరుణ్ భాస్కర్ కామెంట్ చేశారు.
మజాక్ అయిపోయిందా? అని పేర్కొన్నారు. ఈ నగరానికి ఏమైంది మూవీ టికెట్లు అన్నీ సేల్ అయిపోయాయని అయితే కొంతమంది మేము టికెట్స్ ను బ్లాక్ చేశామా? అని అడుగుతున్నారని ఆయన కామెంట్లు చేశారు. మేము బ్లాక్ చేసింది థియేటర్ ను, ప్రేక్షకుల మైండ్ ను మాత్రమేనని తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ విధంగా అప్పుడే చేసుంటే నేను గోవాలో ఇల్లు కట్టుకుని డెవలప్ అయ్యేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.
రాహుకాలంలో పుట్టుంటా నేను అంటూ (Tarun Bhaskar) తరుణ్ భాస్కర్ ట్వీట్ ను ముగించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నగరానికి ఏమైంది సినిమాకు థియేటర్లను పెంచాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకుండా రీ రిలీజ్ లో బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.