ఈ సినిమా కష్టాలు ఎప్పటివరకో..!

  • December 28, 2021 / 09:14 AM IST

ఏపీలో సినిమా కష్టాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఓ పక్క సినిమా టికెట్స్ రేట్లు తగ్గించడంపై సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క.. రూల్స్ కి వ్యతిరేకంగా ఏపీలో నడుస్తోన్న థియేటర్లపై సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నడిపిస్తున్న థియేటర్లను సీజ్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న

అధికారులు వందకు పైగా సినిమా థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. అలానే కొన్నింటినీ సీజ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ముప్పైకి పైగా సినిమా థియేటర్లను సీజ్ చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. మరోపక్క ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్లు తగ్గించడంతో.. ఆ రేట్లతో థియేటర్లను నడిపించలేమంటూ చాలా మంది స్వచ్ఛందంగా థియేటర్లు మూసేస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించి జీవో జారీ చేయడంతో థియేటర్ యాజమాన్యాలు.. ప్రొడ్యూసర్స్.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. తాజాగా ఏపీలో మరో థియేటర్ ను సీజ్ చేశారు అధికారులు. విజయనగరం జిల్లాలోని రామభద్రపురంలోని టీబీఆర్ థియేటర్ పై రెవెన్యూ సిబ్బంది దాడులు చేసింది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఆడుతుండగా.. తనిఖీలు చేసిన అధికారులు థియేటర్ ను సీజ్ చేశారు. వైసీపీ నేత తూముల భాస్కరరావుకు చెందిన థియేటర్ ను సీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus