బిగ్ బాస్ హౌస్ లో కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ కి తనదైన స్టైల్లో క్లాస్ పీకాడు. ముఖ్యంగా శివని డోర్స్ ఓపెన్ చేసి మరీ క్లాస్ పీకాడు. బిందుమాధవి, ఆర్జే చైతూలకి కూడా ఫుడ్ విషయంలో గట్టి క్లాక్ పడింది. ఇక కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా ఉన్న తేజస్వి కరెక్ట్ డెసీషన్ తీసుకుందా లేదా అనేది హౌస్ మేట్స్ ని అడిగాడు. దీంతో అరియానా ఇంకా నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా తమ అభిప్రాయాలని చెప్పారు.
కానీ, ఇక్కడే తేజస్వికి సపోర్ట్ గా నాగార్జున మాట్లాడటం అనేది హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. నిజానికి టాస్క్ ని ని మనం చూసినట్లయితే, గార్డెన్ ఏరియాలో ఉన్న టైల్స్ పై నడుస్తూ లిక్విడ్ ని తీసుకుని తమకి కేటాయించిన కంటైనర్స్ లో నింపాలి. గార్డెన్ లో లావా ప్రవహిస్తూ ఉంటుందని, లావాలో కాలు పెడితే వాళ్లు పోటీ నుంచీ తప్పుకోవాలని చాలా క్లియర్ గా టాస్క్ పేపర్లో ఉంది.
అంతేకాదు, ఏ ఇద్దరు అయితే చివరి వరకూ పోరాడతారో వాళ్ల కంటైనర్స్ లో లిక్విడ్ ఆధారంగా విన్నర్ ని ఎంపిక చేయాలి. ఇక్కడే తేజస్వి అనిల్ కాలు కిందపెట్టాడా లేదా అనే డిబెట్ పెట్టింది. దీంతో అనిల్ కింద పెట్టి మరీ చూపించాడు. అప్పటికీ గేమ్ లో యాంకర్ శివ ఇంకా చైతూ మాత్రమే మిగిలి ఉన్నారు. అయినా కూడా తేజస్వి అనిల్ కి మరో ఛాన్స్ ఇచ్చింది. అప్పటికప్పుడు తేజస్వి డెసీషన్ ని హౌస్ మేట్స్ అభినందించారు.
కానీ, నాగార్జున ముందు మాత్రం కొద్దిగా డౌట్ ని పెట్టారు. దీంతో తేజస్వి కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. నాగార్జున మాత్రం తేజస్వికి సపోర్ట్ చేశాడు. నీ డెసీషన్ పర్ఫెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. నిజానికి టాస్క్ లో ఫైనల్ గా ఇద్దరూ మిగిలినపుడు ఎవరి కంటైనర్ లో లిక్విడ్ ఎక్కువగా ఉందో వాళ్లే విజేత అవుతారు. ఇక్కడ యాంకర్ శివ, ఇంకా అనిల్ మాత్రమే మిగిలినపుడు కంటైనర్స్ ని చెక్ చేసి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా వారితో తిరిగి మళ్లీ గేమ్ అడించింది తేజస్వి.
అందుకే నాగార్జున దీన్ని క్లియర్ చేసి తేజస్వి డెసీషన్ సూపర్ అంటూ కితాబు ఇచ్చాడు. దీంతో తేజస్వి ఊపిరి పీల్చుకుంది. అనిల్ కాలు కిందపెట్టాడని మహేష్ విట్టా అబ్జక్ట్ చేశాడు. అప్పుడే అనిల్ గేమ్ లో నుంచీ తప్పుకుని ఉంటే చైతూ, లేదా శివ ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అయి ఉండేవారు. సంచాలక్ నిర్ణయం వల్ల ఈవారం అనిల్ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. అదీ మేటర్.