‘ఆదిపురుష్’ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రేమను చూపిస్తున్నాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అయితే ముందుగా రాసుకున్న నిబంధనలను పక్కన పెట్టేసింది అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ‘ఆదిపురుష్’ టీమ్‌కు పాజిటివ్ రెస్పాన్స్‌గా తెలంగాణ ప్రభుత్వం నుండి బంపర్ గిఫ్ట్ వచ్చింది అని అంటున్నారు. సినిమాకు ఒకటి కాదు, రెండు ఎక్స్‌ట్రా షోలు వేసేలా పర్మిషన్లు వచ్చాయట.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush) జూన్ 16న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఉచితంగా టికెట్లు అనే ప్రచారం తప్ప ఇంకేమీ చేయడం లేదు. ఎందుకు అని అంటే.. అంతా రిలీజ్ అయ్యాకే అని చెబుతున్నారట. ఈ క్రమంలో బుధవారం నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ‘ఆదిపురుష్’ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి జీవో కూడా విడుదలైంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంచుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి మూడు రోజులు మాత్రమే. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు అదనంగా మరో షోకి కూడా అనుమతి ఇచ్చింది. అయితే రిలీజ్ రోజు 6 షోలు వేసుకోవచ్చు. 16న ఉదయం 4 నుండి ప్రత్యేక షోలు వేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం టికెట్ ధర రూ.175 ఉండగా… ఇప్పుడు రూ. 225 అవుతుంది. 3D సినిమా అయితే గ్లాస్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాలి.
మల్టీప్లెక్స్‌లో రూ. 295 + 3D గ్లాస్ డబ్బులు ఇవ్వాలి. సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. అన్ని చోట్లా టికెట్ ధరలు భారీగానే ఉన్నాయి అంటున్నారు. మరి ప్రేక్షకుల స్పందన, ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.