ధనుష్- నాగార్జున కాంబినేషన్లో ‘కుబేర’ (Kuberaa) అనే క్రేజీ మూవీ వచ్చింది. జూన్ 20న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ తర్వాత కొంచెం స్లో అయ్యింది. కానీ 2వ వీకెండ్ కి మళ్ళీ పికప్ అయ్యింది.

‘కన్నప్ప’ (Kannappa) లాంటి సినిమా పోటీగా ఉన్నా 2వ వీకెండ్ ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 15.01 cr | 
| సీడెడ్ | 4.34 cr | 
| ఉత్తరాంధ్ర | 5.41 cr | 
| ఈస్ట్ | 2.55 cr | 
| వెస్ట్ | 1.52 cr | 
| గుంటూరు | 2.09 cr | 
| కృష్ణా | 2.24 cr | 
| నెల్లూరు | 1.17 cr | 
| ఏపీ+తెలంగాణ | 34.33 cr (షేర్) | 
| తమిళనాడు | 10.24 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.48 cr | 
| ఓవర్సీస్ | 16.40 cr | 
| వరల్డ్ టోటల్ | 67.45 cr (షేర్) | 
‘కుబేర’ (Kuberaa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 10 రోజులకు గాను రూ.67.45 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.114.5 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.7.45 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించింది.
