శ్రీ విజయ్ కాంత్ (విజయరాజ్ అళగర్ స్వామి), సీనియర్ సినీ నటులుగా గుర్తింపు పొందారు. ఆయన 25.08.1952 న మధురై (తమిళనాడు)లో జన్మించారు. నటునిగా 100 కు పైగా సినిమాలలో నటించారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీ భాషలో కూడా అనువదించారు. విజయ్ కాంత్ గారి 100వ చిత్రం “కెప్టెన్ ప్రభాకర్” అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ అయింది. ఆయన ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (చెన్నై) లో 2000-2006 మధ్య కాలంలో అధ్యక్షులుగా పనిచేశారు.
ఆయన తమిళనాడు రాష్ట్రంలో డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసారు. శ్రీ విజయకాంత్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈరోజు(28.12.2023), శ్రీ విజయకాంత్ గారు చెన్నైలో మరణించారు, ఆయన మరణం కుటుంబానికి అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తు….
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి
కె.ఎల్. దామోదర్ ప్రసాద్, గౌరవ కార్యదర్శి
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి
టి. ప్రసన్న కుమార్, గౌరవ కార్యదర్శి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
మాదాల రవి, ఉపాధ్యక్షులు