Buchi Babu: ‘పుష్ప’ పై అంచనాలు పెంచేస్తున్న ‘ఉప్పెన’ దర్శకుడు..!

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ కన్నడ చిత్రం అన్ని భాషల్లో విడుదలై సక్సెస్ అందుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రం తర్వాత హీరో యష్, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఇండియా వైడ్ స్టార్లైపోయారు.

ఇక త్వరలో రాబోతున్న ‘కె.జి.ఎఫ్ 2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది రెండు భాగాలుగా రాబోతున్నట్టు కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ‘పుష్ప’ పార్ట్ 1 షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయితే విడుదల తేదీ ప్రకటిస్తారు.

కాగా ‘పుష్ప’ పార్ట్1 మూవీ… 10 ‘కె.జి.ఎఫ్’ లు కలిపితే ఉన్నట్టు అనిపిస్తుందని సుకుమార్ శిష్యుడు మరియు ‘ఉప్పెన’ దర్శకుడు అయిన బుచ్చిబాబు సానా చెప్పుకొచ్చాడు. ‘ నేను ఆల్రెడీ ‘పుష్ప’ పార్ట్ 1 చూశాను. ఇందులో బన్నీ నటన కానీ సుకుమార్ గారి మాస్ ఎలివేషన్స్ కానీ చూస్తే.. ఒక పది ‘కె.జి.ఎఫ్’ లు కలిపి చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు సానా.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus