మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన 20 నిమిషాల నిడివి గల పాత్రని పోషిస్తున్నాడు. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కుతుంది. ఒరిజినల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర ఇది. సినిమాలో అతని పాత్ర 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అతను ఎటువంటి పాటల్లో కనిపించాడు.
కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్రని ఇంకో 10 నిమిషాలు పెంచి.. 20 నిమిషాలు చేశారు. వీరిద్దరూ కలిసి ఓ పాటలో డాన్స్ చేస్తున్నట్టు కూడా చూపించారు. ‘తార్ మార్ తక్కర్ మార్’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో ఇద్దరు బడా స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటం అనేది అభిమానులకు కన్నుల పండుగలా అనిపించడం ఖాయం.
వీరిద్దరి బ్రోమాన్స్ సినిమాలో ఓ రేంజ్లో ఉండబోతుంది అని ఈ ప్రోమో సాంగ్ చెబుతుంది. తమన్ ఈ పాటకు కంపోజ్ చేసిన మాస్ ట్యూన్ హైలెట్ గా నిలుస్తుంది.సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు మేకర్స్.ఇక మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ప్రోమో సాంగ్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!