ఒకప్పటి స్టార్ హీరోయిన్ అలాగే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్… జయలలిత పాత్రని పోషించగా.. ఒకప్పటి స్టార్ హీరో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రను పోషించారు.తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘విబ్రి మీడియా’, ‘కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. సెప్టెంబర్ 10న వినాయక్ చవితి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది.
ఇక ‘తలైవి’ క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.13 cr |
సీడెడ్ | 0.11 cr |
ఉత్తరాంధ్ర | 0.10 cr |
ఈస్ట్ | 0.05 cr |
వెస్ట్ | 0.04 cr |
గుంటూరు | 0.09 cr |
కృష్ణా | 0.06 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.62 cr |
తెలుగు రాష్ట్రాల్లో ‘తలైవి’ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలబడాలి అంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.62 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో 0.88 కోట్ల నష్టాలను మిగిల్చిందని చెప్పొచ్చు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!