టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశానని అప్పటికి ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా నేను ఫైనల్ కాలేదని థమన్ అన్నారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకుందామని చెప్పారని థమన్ కామెంట్లు చేశారు.
తారక్ సాధారణంగా పాటలను ఫుల్ వాల్యూమ్ లో వినడానికి ఇష్టపడతాడని సంగీతంకు తారక్ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారని థమన్ తెలిపారు. బృందావనం రెండు పాటలు వింటూ మ్యూజిక్ డైరెక్టర్ నేనేనా అని వంశీ పైడిపల్లిని అడిగి ఆ తర్వాత తారక్ నాకు ఫోన్ చేశాడని థమన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని తారక్ అడగగా తారక్ ను కలవడానికి వెళ్లానని థమన్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగే సమయానికి
నా మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదని అయినప్పటికీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన తనకు తారక్ ఛాన్స్ ఇవ్వడం గ్రేట్ అని థమన్ కామెంట్లు చేశారు. జీవితాంతం తారక్ కు నేను రుణపడి ఉంటానని థమన్ చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే తారక్ కు నేను ఎప్పుడూ ఫ్లాప్ మ్యూజిక్ ఇవ్వలేనని ఆయన కామెంట్లు చేశారు. తారక్ సినిమా అంటే 200 శాతం బెస్ట్ మ్యూజిక్ ఇస్తానని థమన్ చెప్పుకొచ్చారు.
తారక్ కలవాలని చెప్పిన సమయంలో ఆనంద భాష్పాలు వచ్చాయని థమన్ కామెంట్లు చేశారు. థమన్ చెప్పిన విషయాలకు తారక్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి, టాలెంటెడ్ టెక్నీషియన్లను ఆయన ప్రోత్సహించే విధానం గురించి ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?