Thaman: ఆ సినిమా విషయంలో థమన్ తప్పు చేశారా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ గత కొన్నేళ్లుగా మళ్లీ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు థమన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది విడుదలైన సినిమాల విషయంలో థమన్ పై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ సినిమాకు సంగీతం అందించకపోయినా థమన్ బీజీఎం అందించారు. అయితే రాధేశ్యామ్ సినిమాకు థమన్ బీజీఎం ప్లస్ కాలేదు.

ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమా పాటల విషయంలో, బీజీఎం విషయంలో థమన్ విమర్శలు ఎదుర్కొన్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాకు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా థాంక్యూ సినిమా నుంచి మారో మారో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ సాధారణ ప్రేక్షకులతో పాటు నాగచైతన్య ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. థమన్ చైతన్య సినిమాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారేంటని నెటిజన్ల నుంచి సైతం నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమా నుంచి విడుదలైన తొలి సాంగ్ ఈ విధంగా ఉందంటే తర్వాత సాంగ్స్ ఏ విధంగా ఉంటాయో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాధారణంగా విక్రమ్ కె కుమార్ సినిమాలో పాటలు బాగుంటాయని ఇండస్ట్రీలో పేరుంది. ఇప్పటికే విడుదలైన థాంక్యూ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

థమన్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తే అవకాశాలు తగ్గడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న చైతన్య థాంక్యూ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తోనే దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus