Thaman: ‘ఎకె’ రీమేక్ … తమన్ ఎందుకు అలా చేసాడు…!

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ – బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో సచి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్- రానా లతో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా తెలుగులో మాత్రం తమన్ సంగీతం అందిస్తున్నాడు.’అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం సినిమాకే ప్లస్ పాయింట్ గా నిలిచింది.

Click Here To Watch

‘భీమ్లా నాయక్’ పాటలకి కూడా మంచి స్పందనే లభిస్తుంది. టైటిల్ సాంగ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే ఈ పాటలకి తమన్ చాలా వరకు ఒరిజినల్ ట్యూన్లనే వాడుకున్నాడు. కానీ ఒరిజినల్ కు సంగీతం అందించిన జేక్స్ బిజోయ్ కు థాంక్స్ కార్డు వేయలేదు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ఒరిజినల్ ట్యూన్ లను వాడుకున్నప్పుడు… ఆ ట్యూన్ ను సమకూర్చుకున్న సంగీత దర్శకుడికి క్రెడిట్ ఇవ్వాలి.

కానీ తమన్ మాత్రం అలా చేయలేదు. దీంతో జేక్స్ హర్ట్ అయ్యాడట.దీంతో ఈ విషయాన్ని ఐ.పి.ఆర్.ఎస్ దృష్టికి తీసుకువెళ్లడానికి అతను సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.ఈలోగా తమన్ ఏదైనా స్టెప్ తీసుకుంటే తప్ప.. ‘భీమ్లా నాయక్’ వివాదంలో చిక్కుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇక ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్టు టీం ముందుగా ప్రకటించింది కానీ అప్పుడు కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని కూడా తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే..!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus