Thaman: అన్నీ ట్రైలర్లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా..? తమన్ ట్వీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘భీమ్లానాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్అంచనాలను మరింతగా పెంచాయి. అయితే ట్రైలర్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. సినిమా పాటల విషయంలో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు కానీ ట్రైలర్ ను చూసి మాత్రం పెదవి విరిచారు.

Click Here To Watch

ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ సరిగ్గా లేదని కామెంట్ చేస్తున్నారు. ‘ఏంటి భయ్యా ఇలా చేశావ్..?’ అంటూ తమన్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ‘అఖండ’ సినిమాతో పోలుస్తూ.. ఆ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేదని అంటున్నారు. ఆ విధంగా తమన్ ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో తమన్ ఈ ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘థియేటర్లో ర్యాంప్ అమ్మా.. అన్నీ ట్రైలర్లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా.. అడవిలోని మంటకు.. వీధుల్లో వచ్చే మంటకు తేడా ఉండాలి కదా?.. కలుద్దాం’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ తో సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పారు. ఈపాటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఫైనల్ గా ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

తెలంగాణలో బుక్ మై షో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఓవర్సీస్ లో కూడా ‘భీమ్లానాయక్’ ఫీవర్ మాములుగా లేదు. ఏపీలో మాత్రం ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus