నిన్నమొన్నటివరకూ ఆటోమేటిక్ ట్యూన్స్, కాపీ ట్యూన్స్, ఇతర భాషల్లో బాగా పాపులర్ అయిన లేదా ఎవరూ పెద్దగా వినని ట్యూన్స్ ని తన ఎలక్ట్రానిక్ ట్యూనింగ్ తో మిక్స్ చేసి.. ఒక్కోసారి తన పాటలను తానే రిపీట్ కొడుతూ వచ్చిన తమన్ లో ఉన్నట్లుంది పెనుమార్పే చోటు చేసుకొంది. అందుకే ఉన్నట్లుండి మాస్ ట్యూన్స్ ను దాదాపుగా తగ్గించేసి మెలోడీవైపు దృష్టి మరల్చాడు. మొన్న విడుదలైన “తొలిప్రేమ” సాధించిన ఘన విజయంలో తమన్ సంగీతం, నేపధ్య సంగీతం కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకే సినిమాలో నటించిన హీరోహీరోయిన్లు మరియు దర్శకుడితో సమానంగా తమన్ కి కూడా మంచి పేరొచ్చింది.
ఆ పేరుని కంటిన్యూ చేస్తే ఇవాళ విడుదలైన “చల్ మోహనరంగా” చిత్రంలోని “గ.. ఘ.. మేఘ” పాటతో మరోమారు తనదైన మెలోడీతో ఆకట్టుకొన్నాడు. సాహిత్యంతోపాటు సందర్భం కూడా సరిగ్గా కుదిరిన ఈ పాట తమన్ రేంజ్ ని పెంచేలా ఉండడం విశేషం. నితిన్-మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు. పవన్ కళ్యాణ్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి-త్రివిక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండడం విశేషం. ఏప్రిల్లో ఈ చిత్రం విడుదలకానుంది.