SSMB28 ప్రాజెక్ట్ లో ఆ మార్పే లేదు!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మధ్యకాలంలో తమన్ కొడుతున్న ట్యూన్స్ క్యాచీగా లేవని.. ‘సర్కారు వారి పాట’ సినిమాలో పాటలు కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు కాబట్టి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అనిరుధ్ ని రంగంలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కన్ఫర్మ్ చేసింది.

డైరెక్ట్ గా కాకుండా.. తమన్ పుట్టినరోజు నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో #SSMB28 ట్యూన్స్ కోసం వెయిటింగ్ అంటూ బర్త్ డే విషెస్ చెప్పింది. దీంతో ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అసలు తమన్ ని కాదని అనిరుధ్ ను తీసుకునే ప్రసక్తే లేదు. ఇదివరకు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ట్యూన్స్ బాగానే ఉంటాయి కానీ వర్కవుట్ కాలేదు.

అనిరుధ్ కి తెలుగు భాష రాదు కాబట్టి సాహిత్యాన్ని అర్ధం చేసుకొని మ్యూజిక్ చేయడంలో కాస్త తడబడ్డారు. ఆ సమయంలో త్రివిక్రమ్ స్వయంగా అనిరుధ్ ని తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు తమన్ ను తీసేసి అనిరుధ్ ని ఎలా పెట్టుకుంటారు..? పైగా త్రివిక్రమ్ సినిమా అంటే తమన్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. కాబట్టి SSMB28 ప్రాజెక్ట్ కి తమన్ రైట్ ఛాయిస్ అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ లో మొదలుకానుంది. ఇటీవల కృష్ణగారు మరణించడంతో త్రివిక్రమ్ సినిమాకి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మహేష్ స్వయంగా డిసెంబర్ మొదటివారం నుంచి షూటింగ్ పెట్టుకుందామని చెప్పడంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus