‘రాబిన్ హుడ్’ తర్వాత నితిన్ (Nithiin) నుండి వచ్చిన చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). గత వారం అంటే జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.75 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమా కావడంతో మొదటి నుండి అగ్రెసివ్ గా ప్రమోట్ చేశారు దిల్ రాజు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల జనాలు ఎక్కువగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు.

కానీ రిలీజ్ ట్రైలర్, శిరీష్ ఇష్యు వల్ల ఆ మైలేజ్ అంతా డైవర్ట్ అయిపోయింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.10 cr |
| సీడెడ్ | 0.29 cr |
| ఉత్తరాంధ్ర | 0.50 cr |
| ఈస్ట్ | 0.13 cr |
| వెస్ట్ | 0.07 cr |
| గుంటూరు | 0.29 cr |
| కృష్ణా | 0.32 cr |
| నెల్లూరు | 0.06 cr |
| ఏపీ+తెలంగాణ | 2.76 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.28 cr |
| ఓవర్సీస్ | 0.57 cr |
| వరల్డ్ టోటల్ | 3.61 cr (షేర్) |
‘తమ్ముడు’ (Thammudu) సినిమాకు రూ.22 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.22.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.3.61 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.6.02 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో రూ.18.89 కోట్లు షేర్ ను రాబట్టాలి.
